Share News

హర్యానా సివిల్ సర్వీసెస్‌లో యువతికి ఐదో ర్యాంకు

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:25 AM

ఆమె ఏ కోచింగ్ సెంటర్‌కూ పోలేదు. అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. చాట్ జీపీటీ వాడి సొంతంగా ప్రిపేర్ అయి హర్యానా సివిల్ సర్వీసెస్‌లో (హెచ్‌సీఎస్) ఐదో ర్యాంకు పొందింది 23 ఏళ్ల ఛావి సర్దానా. హర్యానాలోని హిసార్‌కు చెందిన ఛావి. హెచ్‌సీఎస్‌లో 675 మార్కులకు గాను 385.80 మార్కులు సాధించింది.

హర్యానా సివిల్ సర్వీసెస్‌లో యువతికి ఐదో ర్యాంకు

ఇంటర్‌నెట్ డెస్క్: ఆమె ఏ కోచింగ్ సెంటర్‌కూ పోలేదు. అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. చాట్ జీపీటీ వాడి సొంతంగా ప్రిపేర్ అయి హర్యానా సివిల్ సర్వీసెస్‌లో (హెచ్‌సీఎస్) ఐదో ర్యాంకు పొందింది 23 ఏళ్ల ఛావి సర్దానా. హర్యానాలోని హిసార్‌కు చెందిన ఛావి.. హెచ్‌సీఎస్‌లో 675 మార్కులకు గాను 385.80 మార్కులు సాధించింది. అంతేకాకుండా తన కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తి కూడా ఆమెనే. వాస్తవానికి ఛావి పటియాలాలో బీఏ ఎల్ఎల్‌బీ పూర్తి చేసింది. ముందుగా అడ్వొకేట్ అవ్వాలనుకుంది. అయితే, సివిల్ సర్వీసెస్‌లో చేరాలని లక్ష్యం పెట్టుకుంది. కాలేజీ విద్య అభ్యసిస్తూనే సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయింది. ఇందుకోసం ఆమె ఎలాంటి కోచింగ్ సెంటర్‌కు పోలేదు. సొంతంగా ప్రిపేర్ అవుతూనే చాట్ జీపీటీ సాయం తీసుకుంది. తనకు వచ్చిన సందేహాలను చాట్ జీపీటీ ద్వారా క్లియర్ చేసుకుంది.


ఆ టైంలో సోషల్ మీడియాకు దూరంగా

హర్యానా సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఛావి పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. రోజుకు 8 గంటలపాటు ప్రిపేర్ అయింది. ఇదే తన విజయానికి కారణమని ఆమె తెలిపింది. నిలకడగా ప్రిపేర్ కావడం, కాలాన్ని సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని వెల్లడించింది. కాగా.. హెచ్‌సీఎస్ పరీక్షకు మొత్తం 60 వేల మంది హాజరయ్యారు. వివిధ దశల్లో అభ్యర్థులను ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇక ఈ పరీక్ష మొదటి దశ ఏప్రిల్‌లో జరగగా.. రెండో దశను జూన్‌లో నిర్వహించారు. ఈనెల 3 నుంచి 8 మధ్య పంచకులలోని కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు..

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

Updated Date - Oct 10 , 2026 | 10:04 AM