గడ్కరీతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:42 PM
సోషల్ మీడియాలో తనతోపాటు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, జులై 27: తనతోపాటు తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టును ఆయన ఆశ్రయించారు. మెటా (Meta) సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతోపాటు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాంబే హైకోర్టులో ఆయన సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోనిదని ఆయన స్పష్టం చేశారు. తనపై కావాలనే నిందలు వేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏఐ (AI) డీప్ ఫేక్ వీడియోలు, అసత్య ప్రచారాలను వేగంగా వ్యాప్తి చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. E 20 ఇథనాల్ వ్యాపారంలో లాభపడ్డారంటూ తనపై వస్తున్న ఆరోపణలను నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు.
ఇథనాల్ పాలసీకి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఏ మాత్రం సంబంధం లేదని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. ఈ 20 ఇథనాల్ వ్యాపారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వస్తుందని చెప్పారు. ఈ20 (E 20) ఇథనాల్ బిజినెస్ ద్వారా అక్రమ లాభాలు పొందారంటూ నితిన్ గడ్కరీతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై తప్పుడు కథనాలు... డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ అయ్యారు. ఈ ప్రచారం చేస్తున్న వారితోపాటు సోషల్ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు మంత్రి నితిన్ గడ్కరీ విన్నవించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అయోధ్య విరాళాల కేసు.. 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..
For More National News And Telugu News