Share News

అయోధ్య విరాళాల కేసు.. 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

ABN , Publish Date - Jul 27 , 2026 | 04:46 PM

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది.

అయోధ్య విరాళాల కేసు.. 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్‌ను ఆదేశిస్తూ డెడ్‌లైన్ విధించింది న్యాయస్థానం.


ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. అయితే.. ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.


ఇవీ చదవండి:

విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

విద్యార్థులపై దాడులు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Jul 27 , 2026 | 05:32 PM