Plance Crach: కుప్పకూలిన చార్టర్డ్ విమానం... పైలట్, ప్రయాణికులకు గాయాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:14 PM
ఒడిశాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ సమచారం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
రూర్కెలా: ఒడిశా (Odisha) లోని రూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తోన్న తొమ్మిది సీటర్ల ఇండియావన్ ఎయిర్ విమానం శనివారం కుప్పకూలింది. రూర్కెలా నుంచి టేకాఫ్ అయి 10 కిలోమీటర్ల ప్రయాణం చేసిన అనంతరం ఇంజన్ విఫలం కావడంతో పంటపొలాల్లో విమానం పడిపోయినట్టు సమాచారం. ఘటనా సమయంలో ఆ విమానంలో ఏడుగురు ప్రయాణిస్తుండగా, పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు, ఇద్దరి సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
విమానం కుప్పకూలిన సమచారం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని సమీక్షించేందుకు టూరిజం శాఖ బృందం కూడా భువనేశ్వర్ నుంచి ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లింది.
ఇవి కూడా చదవండి..
విజయ్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన సీబీఐ
చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి