Share News

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ యాత్రికుడు క్షేమం

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:56 AM

నేపాల్‌ను ముంచెత్తిన వరదల్లో చిక్కుకుని, ఆచూకీ లభించకుండా పోయిన తెలంగాణకు చెందిన అల్లి ఇలేష సురక్షితంగా బయటపడ్డారు. శనివారం (ఆగస్టు 29న) ఆయన...

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ యాత్రికుడు క్షేమం

  • సహాయక చర్యల్లో దొరికిన అల్లి ఇలేష ఆచూకీ

  • నేపాల్‌ చేరుకున్న వందలాది మంది భారతీయులు

  • ధ్రువీకరించిన విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నేపాల్‌ను ముంచెత్తిన వరదల్లో చిక్కుకుని, ఆచూకీ లభించకుండా పోయిన తెలంగాణకు చెందిన అల్లి ఇలేష సురక్షితంగా బయటపడ్డారు. శనివారం (ఆగస్టు 29న) ఆయన టిబెట్‌ నుంచి నేపాల్‌కు సురక్షితంగా చేరుకున్నట్లు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అధికారులు ధ్రువీకరించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) విడుదల చేసిన వివరాలతో ఆయన గుర్తింపు సరిపోలిందని తెలిపారు. ప్రస్తుతం ఇలేష తన కుటుంబ సభ్యులతో మాట్లాడారని, ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకుంటారని వెల్లడించారు. ఎంఈఏ తాజా సమాచారం ప్రకారం.. టిబెట్‌ నుంచి శనివారం 449 మంది, ఆదివారం మరో 397 మంది భారతీయులు నేపాల్‌ చేరుకున్నారు. ఇంకా ఆచూకీ దొరకని వారి కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్‌ సమన్వయం చేసుకుంటోంది. నేపాల్‌ పోలీసు లు ేసకరించిన మృతదేహాల ఫోటోలు, వివరాలను అధికారిక పోర్టల్‌లో ఉంచామని, వీటి ఆధారంగా కుటుంబ సభ్యులు తమ వారిని గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. బాధితుల మృతదేహాలను గుర్తించడానికి ఆధారాలు ఉంటే డీఎన్‌ఏ పరీక్షలు అవసరం లేదని, ఆనవాళ్లు లభించని పక్షంలోనే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంకా కాంటాక్ట్‌లోకి రాని వారిని అప్పుడే మరణించినట్లు భావించొద్దని, అధికారిక నిర్ధారణ వచ్చేవరకు ఆందోళన చెందవద్దని తెలంగాణ భవన్‌ సూచించింది. రసువా, నువాకోట్‌, ధాదింగ్‌, చిత్వాన్‌, గోర్ఖా, తనాహున్‌, నవల్పరాసి ఈస్ట్‌/వెస్ట్‌, ఖాట్మండు జిల్లాల్లో మృతదేహాలను భద్రపరిచారని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 05:56 AM