కోయంబత్తూరులో విషాదం.. విద్యార్థిని ఆత్మహత్య!
ABN , Publish Date - Jun 18 , 2026 | 08:18 AM
తమిళనాడులోని కోయంబత్తూరులో విషాదకర ఘటన వెలుగుచూసింది. 19 ఏళ్ల విద్యార్థిని మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరులో విషాదకర ఘటన వెలుగుచూసింది. 19 ఏళ్ల విద్యార్థిని మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. కోయంబత్తూరు పుదూర్ ప్రాంతానికి చెందిన కీర్తన అనే యువతి గత ఏడాది నీట్ పరీక్షలో అర్హత సాధించి, డెంటల్ కోర్సులో సీటు కూడా సంపాదించింది. అయితే, ఎలాగైనా ఎంబీబీఎస్ చేయాలనే బలమైన కోరికతో ఆమె ఈ ఏడాది మళ్లీ నీట్ పరీక్ష రాసింది. కానీ, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వివాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది.
పేపర్ లీకేజీ కారణంగా అధికారులు పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని నిర్ణయించడంతో కీర్తన తీవ్ర నిరాశకు గురైంది. అప్పటికే ఎంతో కష్టపడి రాసిన పరీక్ష రద్దు కావడం, మళ్లీ మొదటి నుంచి రీ-ఎగ్జామ్‌కు సిద్ధం కావాల్సి రావడంతో ఆమెపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పడింది. ఈ క్రమంలోనే భవిష్యత్తుపై ఆందోళనతో ఆమె తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ హృదయవిదారక ఘటనపై సమాచారం అందుకున్న కునియముత్తూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం
స్వదేశీ కామికాజ్ డ్రోన్ల తయారీకి టెండర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News