Share News

ముంబై విమానాశ్రయానికి 'గల్ఫ్' సెగ.. విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:24 PM

పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాల వల్ల గల్ఫ్‌కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే..

ముంబై విమానాశ్రయానికి 'గల్ఫ్' సెగ.. విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!
Mumbai Airport Chaos

ఇంటర్నెట్ డెస్క్: ముంబై(Mumbai)లో సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(CSMIA)లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్‌(Gulf)కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. దీంతో విమానాశ్రయంలో వందల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో ముంబై నుంచి దుబాయ్, కువైట్, మస్కట్, ఖతార్, సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.


భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా తమ సర్వీసులు రద్దు చేసుకోగా, ఇండిగో మార్చి 3 వరకు 200కి పైగా విమానాలను రద్దు చేసింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. విమానాలు ఎప్పుడు పునరుద్దరిస్తారో తెలియక, ఎయిర్‌లైన్స్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పసిబిడ్డలు, వృద్దులతో కూడిన కుటుంబాలు విమానాశ్రయ ఫ్లోర్‌లపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూనే ఉంది.


ఇవి కూడా చదవండి

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

రాజధాని నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం

Updated Date - Mar 02 , 2026 | 12:55 PM