Share News

రాజధాని నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం

ABN , Publish Date - Mar 02 , 2026 | 10:46 AM

రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతే వెళ్లిపోవాలని అన్నారు.

రాజధాని నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం
Minister Narayana

అమరావతి, మార్చి 2: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్టు సంస్థలపై మంత్రి నారాయణ (Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) రాజధాని ప్రాంతంలో మంత్రి పర్యటించారు. నేలపాడు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్, గ్రూప్‌-డి ఉద్యోగుల క్వార్టర్స్‌తో పాటు వివిధ నిర్మాణాలను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు.


షాపూర్ జీ పల్లోంజీ కన్ట్రక్షన్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను వెంటనే పంపించేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి(CM Chandrababu Naidu) పనుల ఆలస్యంపై సంజాయిషీ ఇవ్వాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని నిర్మాణాలు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు.


ఇవి కూడా చదవండి...

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

అమరావతిలో బిజీబిజీగా సీజేఐ పర్యటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 11:26 AM