Share News

ఫుట్‌బాల్ ఆడుతూ.. ఎంపీ రికీ ఆండ్రూ సింగ్కాన్ మృతి

ABN , Publish Date - Feb 20 , 2026 | 07:00 AM

మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షిల్లాంగ్‌కు చెందిన ఎంపీ, ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ’ కీలక నేత రికీ ఆండ్రూ జె.సింగ్కాన్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

ఫుట్‌బాల్ ఆడుతూ.. ఎంపీ రికీ ఆండ్రూ సింగ్కాన్ మృతి
Meghalaya MP Passed away

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ(Meghalaya) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షిల్లాంగ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ, ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ’(VPP) కీలక నేత రికీ ఆండ్రూ జె.సింగ్కాన్ మృతిచెందారు. నిన్న (గురువారం) సాయంత్రం మావ్లై మావియోంగ్‌లోని ఓ గ్రౌండ్‌లో తన స్నేహితులతో కలిసి ఫుట్‌‌‌బాల్ (Football) ఆడుతూ అకస్మాత్తుగా గ్రౌండ్‌లో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు వైద్య సహాయం కోసం మావియోంగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆండ్రూను తరలించారు.


మెరుగైన చికిత్స కోసం జైవ్‌లోని డాక్టర్ హెచ్ గోర్డాన్ రాబర్ట్స్ హాస్పిటల్‌కు ఆయనను తీసుకువెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ మరణించారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన జె.సింగ్కాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రడ్ సంగ్మా‌తోపాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

For More National News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 12:57 PM