మణిపూర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి
ABN , Publish Date - Jul 06 , 2026 | 09:13 PM
మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం జవాన్లు కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారు.
ఇంటర్నెట్ డెస్క్: మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. ఈ బాంబు పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఈ దాడిని మణిపూర్ సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఖండించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తరహా క్రూరమైన హింసను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఈ అకృత్యాలను చూస్తూ ఉండబోదని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని మణిపూర్ సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఉఖ్రుల్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని నుంగ్‌సాంగ్‌ఖోంగ్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్
నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్
For More National News And Telugu News