పార్కింగ్‌లో అడ్డుగా ఉన్న కారు.. ఏం చేశాడో చూడండి.?
ABN , Publish Date - Feb 09 , 2026 | 08:28 PM
నగరాల్లో పార్కింగ్ సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పార్కింగ్ విషయాల్లో పెద్ద గొడవలే జరుగుతాయి. ఒక వ్యక్తి తన కారుకు అడ్డుగా పార్క్ చేసి ఉన్న మరో కారును చేతులతో పక్కకు జరిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి పార్కింగ్ స్థలంలో తన కారుకు అడ్డుగా మరో కారు ఉండటం చూసి ఆగ్రహించాడు. వెంటనే దాన్ని చేతులతో తోస్తూ పక్కకు జరిపాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డ్రైవర్ కోసం వేచి చూడటమో లేదా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం ఏకంగా కారును చేతులతో పక్కకు నెట్టడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను @VishalMalvi_ అనే యూజర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అతడు నిజంగా ధైర్యవంతుడు’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఇండియన్ హల్క్’ అని ఒకరు, ‘ఇది అసలు సాధ్యమేనా?’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
హార్వర్డ్‌కు పోయినా రేవంత్‌రెడ్డి మారడు.. హరీశ్‌రావు సెటైర్లు
చాక్లెట్ డే.. ఎందుకు జరుపుకొంటారో తెలుసా?