Share News

కూతురి ఘాతుకం.. తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి..

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:13 PM

బెంగళూరుకు చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి కన్నతల్లికి ద్రోహం చేసింది. కన్న తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడికి పంపింది.

కూతురి ఘాతుకం.. తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి..
Bengaluru private photo sharing case,

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రియుడి మోజులో పడి ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. కన్న తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడికి పంపింది. కర్ణాటకలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల ఓ యువతి డిగ్రీ చదువుతోంది. స్టడీస్ కోసం ఫోన్ చాలా అవసరం అని చెప్పటంతో నెల రోజుల క్రితం తల్లిదండ్రులు యువతికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. అయితే, ఆ యువతి చదువుకోవాల్సింది పోయి.. గంటలు, గంటలు ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. ఇది గమనించిన తల్లి ఆగ్రహానికి గురైంది.


యువతి ఫోన్ లాక్కుని చెక్ చేసింది. ఆ ఫోన్‌లో తన ప్రైవేట్ ఫొటోలతో పాటు మరో బంధువు ప్రైవేట్ ఫొటోలు కూడా కనిపించాయి. దీంతో ఆ మహిళ షాక్ అయింది. ఆమె తన కూతుర్ని ఫొటోల గురించి నిలదీసింది. కూతురు తన ప్రైవేట్ ఫొటోలు తీయటమే కాకుండా వాటిని ఆమె ప్రియుడికి పంపిందని తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన కూతురితో పాటు ఆమె ప్రియుడిపై కూడా ఫిర్యాదు చేసింది.


ఆ మహిళ తన ఫిర్యాదులో.. ‘నా కూతురు అనుమతి లేకుండా నా ప్రైవేట్ ఫొటోలను తీసింది. తీయటమే కాకుండా వాటిని ఆమె ప్రియుడికి పంపింది. మాకు తెలియకుండా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని అంటోంది’ అని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్మార్ట్ ‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ సంఘటనపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత నిజా నిజాలు తెలుస్తాయి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

హార్వర్డ్‌కు పోయినా రేవంత్‌రెడ్డి మారడు.. హరీశ్‌రావు సెటైర్లు

భారత్-పాక్ వివాదం.. మూడు డిమాండ్లను ఐసీసీ ముందుంచిన పీసీబీ!

Updated Date - Feb 09 , 2026 | 12:48 PM