Share News

అమిత్‌షాపై లీగల్ కేసు వేస్తా: మమతా బెనర్జీ

ABN , Publish Date - Apr 25 , 2026 | 08:41 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన హింసాత్మక వ్యాఖ్యలపై లీగల్ కేసు వేయనున్నట్టు పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తెలిపారు.

అమిత్‌షాపై లీగల్ కేసు వేస్తా: మమతా బెనర్జీ
Amit Shah, Mamata Banerjee

హుగ్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన హింసాత్మక వ్యాఖ్యలపై లీగల్ కేసు వేయనున్నట్టు పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. హుగ్లీలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తర్వాత టీఎంసీ కార్యకర్తలను 'తలకిందులుగా వేలాడదీస్తాం' అంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఒక హోం మంత్రి స్థాయికి తగవని, ఇలాంటి దురుసు పోగడలతో బెంగాల్ ఓటర్ల మనసులు గెలుచుకోలేరని అన్నారు.


'హోం మంత్రి వాడుతున్న భాషను ఏమనాలి? ఎన్నికల తర్వాత జనాలను తలకిందులుగా వేలాడదీస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్లు బెంగాల్‌లో ఎప్పటికీ గెలవలేరు' అని మమత అన్నారు.


అమిత్‌షా ఏమన్నారంటే..

ఆరంబాగ్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడుతూ, 29న ఆరాంబాగ్ ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే మే 5వ తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 'దీదీ గూండాలను నేను హెచ్చరిస్తున్నాను. 29న ఇళ్ల నుంచి బయటకు రాకండి. 29న ఆరంబాగ్ ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే తలకిందులుగా వేలాడదీసి దారిలో పెడతాం' అని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఈనెల 29న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

గూండాలకు జైలు లేకుంటే పైకి ... రాజ్‌నాథ్ హెచ్చరిక

బీజేపీ వస్తే రాత్రి ఒంటిగంటకైనా మహిళలు బయట తిరగొచ్చు.. మమతపై అమిత్ షా విమర్శలు..

Updated Date - Apr 25 , 2026 | 08:53 PM