గూండాలకు జైలు లేకుంటే పైకి ... రాజ్‌నాథ్ హెచ్చరిక
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:09 PM
పశ్చిమబెంగాల్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. రాష్ట్రం నుంచి గూండాలను ఏరివేసేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
హుగ్లీ: పశ్చిమబెంగాల్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. రాష్ట్రం నుంచి గూండాలను ఏరివేసేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 'గూండాలను జైలుకు లేకుంటే పైకి పంపిస్తాం' (behind bars or upar honge) అని హెచ్చరించారు. హుగ్లీలో శనివారంనాడు జరిగిన రోడ్‌షోలో పశ్చిమబెంగాల్ ప్రజలకు ఎన్డీయే ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. రైతుల, యువజన సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టిసారిస్తామని అన్నారు.
'బెంగాల్‌లో గూండాలకు చోటులేదని ఇంతకుముందు కూడా చెప్పాను. గూండాగిరి చేస్తే జైళ్లకు పంపుతాం. లేకంటే అంతకంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. శాంతిభద్రతలను పటిష్టం చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధరలు, యువతకు ఉపాధి, మంచి రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి చేపడతాం' అని చెప్పారు.
ఇదే చివరి ఛాన్స్
'టీఎంసీ గూండాగిరి' పేరుతో బీజేపీ ఈసారి ఎన్నికల్లో విస్తృత ప్రచారం సాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఏప్రిల్ 19న జరిగిన ఎన్నికల ర్యాలీలో టీఎంసీ గూండాలు, సిండికేట్లు, అవినీతి శక్తులకు ఇదే చివరి ఛాన్స్ అని హెచ్చరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల లోపు ఈశక్తులన్నీ లొంగిపోవాలని, లేదంటే మే 4వ తేదీ తర్వాత ఎవర్నీ విడిచిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. ఏప్రిల్ 29లోగా సమీపంలోని పోలీస్ స్టేషన్లలో లొంగిపోవాలని సూచించారు. బెంగాల్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ ఈనెల 29న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
బీజేపీ వస్తే రాత్రి ఒంటిగంటకైనా మహిళలు బయట తిరగొచ్చు.. మమతపై అమిత్ షా విమర్శలు..
లోధి ఎస్టేట్‌లో కేజ్రీవాల్ శీష్ మహల్ 2... బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఆప్