Share News

బీజేపీ వస్తే రాత్రి ఒంటిగంటకైనా మహిళలు బయట తిరగొచ్చు.. మమతపై అమిత్ షా విమర్శలు..

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:54 PM

మే ఐదో తేదీ తర్వాతి నుంచి పశ్చిమ బెంగాల్ మహిళలు రాత్రి ఒంటి గంట తర్వాత కూడా భయం లేకుండా రోడ్లుపై తిరగొచ్చని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని జమాల్‌పూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు.

బీజేపీ వస్తే రాత్రి ఒంటిగంటకైనా మహిళలు బయట తిరగొచ్చు.. మమతపై అమిత్ షా విమర్శలు..
Amit Shah women safety Bengal

మే ఐదో తేదీ తర్వాతి నుంచి పశ్చిమ బెంగాల్ మహిళలు రాత్రి ఒంటి గంట తర్వాత కూడా భయం లేకుండా రోడ్లుపై తిరగొచ్చని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని జమాల్‌పూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం బెంగాళీ మహిళలు భయంతో జీవిస్తున్నారని అన్నారు (Amit Shah women safety Bengal).


మహిళలు సాయంత్రం ఏడు తర్వాత బయటికి రావొద్దంటూ మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను అమిత్ షా విమర్శించారు. 'ఒక మహిళా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పాలనకు సంకేతమా?' అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలు ధైర్యంగా ఉన్నారని, మే 5 తర్వాత బెంగాళీ మహిళల పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అన్నారు. తల్లులు, సోదరీమణుల వైపు దురుద్దేశంతో చూసేందుకు ఏ దుండగుడు సాహసించినా, వారిని జైలులో పెడతామని భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తుందన్నారు (West Bengal elections 2026).


'గత పదిహేను సంవత్సరాల మమతా బెనర్జీ పాలనలో, అత్యధికంగా నష్టపోయిన వారు మన తల్లులు, సోదరీమణులే (BJP vs TMC law and order). బెంగాల్‌లో మహిళలపై ఎన్నో హింసాత్మక ఘటనల జరిగాయి. మహిళలు రాత్రి 7 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రాకూడదని దీదీ అంటున్నారు. నేను మీకు చెప్పేదేమిటంటే.. 5వ తేదీ తర్వాత, యువతులు రాత్రి 1 గంట తర్వాత కూడా బయటకు రాగలరు. ఏ దుండగుడూ ఆమె వైపు చూడటానికి కూడా సాహసించడు' అని అమిత్ షా హామీనిచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..


నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

Updated Date - Apr 25 , 2026 | 06:29 PM