నన్ను అనవసరంగా వివాదంలోకి లాగారు: మనోజ్ నరవణె
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:38 PM
భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నవరణె తన అముద్రిత పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పై నెలకొన్న వివాదంపై స్పందించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని విషయాలను కోట్ చేసి తనను వివాదంలోకి లాగారని, అది సరైనది కాదని అన్నారు.
భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణె తన అముద్రిత పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పై నెలకొన్న వివాదంపై స్పందించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని విషయాలను కోట్ చేసి తనను వివాదంలోకి లాగారని, అది సరైనది కాదని అన్నారు. ఏదేమైనా ఆ వివాదం ఇప్పటికే ముగిసిందని, దానిపై మరింత చర్చ అవసరం లేదని తేల్చి చెప్పారు (MM Naravane controversy).
నరవణె రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు. అయితే ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను లోక్‌సభలో ప్రస్తావించిన విపక్ష నేత రాహుల్ గాంధీ వివాదానికి తెర తీశారు. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ నరవణె ఈ పుస్తకాన్ని రాశారు. అయితే ఆ పుస్తకం ప్రచురణకు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ ఈ పుసక్తం గురించి రాహుల్ గాంధీ లోక్‌సభలో చర్చ లేవనెత్తారు. ఈ వివాదం కొన్ని రోజుల పాటు కొనసాగింది (Rahul Gandhi Naravane book).
నరవణె రాసిన మరో పుస్తకం 'ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్ ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్' తాజాగా విడుదలైంది (Indian Army politics debate). ఈ క్రమంలో నరవణె ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకానికి సంబంధించిన వివాదం గురించి మాట్లాడారు. 'ప్రచురితం కాని పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కొందరు దానిపై తీవ్ర చర్చలు చేశారు. పుస్తకంతో పాటు నన్నూ వివాదంలోకి లాగారు. అది ఏమాత్రం సమంజసం కాదు' అని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ నరవణే పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..