శీష్ మహల్ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం.. కేజ్రీవాల్‌పై ఎంపీ రాఘవ్ చద్దా విమర్శలు..
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:33 PM
శీష్ మహల్ (అద్దాల మేడ) కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి అదే ప్రధాన కారణమని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలలో రాఘవ్ చద్దా ఒకరు.
శీష్ మహల్ (అద్దాల మేడ) కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి అదే ప్రధాన కారణమని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలలో రాఘవ్ చద్దా ఒకరు. బయటకు వచ్చిన తర్వాత, ఆప్‌పై, అధినేత కేజ్రీవాల్‌పై చద్దా వరుసగా విమర్శలు చేస్తున్నారు (Raghav Chadha AAP defeat).
'శీష్ మహల్ కారణంగా పార్టీ ప్రతిష్ఠ నాశనమైంది. అదే ఓటమికి ప్రధాన కారణం. పంజాబ్‌లో శీష్ మహల్-2 అంటూ మరోసారి ఇదే వివాదం ముందుకు వచ్చింది. అవినీతిపరులు, రాజీపడిన వారి చేతుల్లోకి పార్టీ వెళ్లిపోయింది. నిరాశ, నిస్పృహ, అసహ్యం వల్లే బయటకు వచ్చాం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. మేం భయంతో కాదు.. ఇష్టం లేకపోవడం వల్లే పార్టీని వీడాం' అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు (Sheesh Mahal controversy Delhi).
శీష్ మహిల్ వివాదం ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసానికి సంబంధించినది (Arvind Kejriwal bungalow row). ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం పునర్నిర్మాణం కోసం భారీగా ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన మార్బుల్, ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్ వాడారని, అందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సాధారణ జీవితం గడుపుతానని చెప్పిన నేత ఇలా విలాసవంతమైన ఇంట్లో ఉండడం ఏంటని బీజేపీ నేతలు కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడానికి శీష్ మహిల్ వివాదం ప్రధాన కారణమని చాలా మంది భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..