Share News

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

ABN , Publish Date - Jun 16 , 2026 | 03:57 PM

తృణమూల్ కాంగ్రెస్‌‌లో తలెత్తిన సంక్షోభం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో భవానీ పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారంనాడు సవాలు చేశారు. కోల్‌కతా హైకోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు.

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్
Mamata Banerjee

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌‌లో తలెత్తిన సంక్షోభం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో భవానీ పూర్ (Bhabanipur) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు సవాలు చేశారు. కోల్‌కతా హైకోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు. టీఎంసీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం మమతాబెనర్జీ హైకోర్టును ఆశ్రయించడం ఇది రెండోసారి.


భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల పోటీ చేసిన మమతా బెనర్జీ అక్కడి నుంచి ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 4న ప్రకటించారు. బీజేపీ భారీ విజయం సాధించడంతో సువేందు అధికారి కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్ ఓ పెద్ద జోక్, రాజకీయ పరిపక్వత లేదు.. డీఎంకే విమర్శల దాడి
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

Updated Date - Jun 16 , 2026 | 05:24 PM