Share News

పనామాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత

ABN , Publish Date - Oct 10 , 2026 | 10:26 AM

సెంట్రల్ అమెరికా దేశం పనామాలో శుక్రవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.7గా నమోదైంది. ఒక నిమిషం పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

పనామాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత
eathquake hits panama

ఇంటర్‌నెట్ డెస్క్: సెంట్రల్ అమెరికా దేశం పనామాలో శుక్రవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.7గా నమోదైంది. ఒక నిమిషం పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి ప్రాణనష్టం సంభవించకున్నా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. పనామా సిటీలో పెద్దపెద్ద భవనాలు కంపించాయి. ఇళ్లలోని కిచెన్ వస్తువులు, మంచాలు షేక్ అయ్యాయి. పనామా సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ‘‘కంపనాలు చాలా తీవ్రంగా ఉండడంతో నాకు చాలా భయమేసింది. ఇంట్లోని బెడ్లు, అల్మారాలు లాంటి భారీ వస్తువులతో పాటు కిచెన్ ఐటమ్స్ కూడా కదిలిపోయాయి. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు 15 అంతస్తుల మా భవనంలోని వారంతా బయటకు పరుగులు తీశాం’’ అని సాలమన్ ఆండియన్ అనే వ్యక్తి తెలిపాడు. అలాగే 20 అంతస్తులకుపైగా ఉన్న ఓ భవనం రూఫ్ టాప్ పూల్ నుంచి నీళ్లు కిందకు పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.


అలాగే, పనామా కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జి కూడా కాసేపు భయంకరంగా ఊగుతూ కనిపించింది. అయినా కూడా ఆ బ్రిడ్జిపై నుంచి వాహనాలు వెళ్లాయి. భూకంపంపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినొ స్పందించారు. తాము ఒక భయంకరమైన విపత్తును ఎదుర్కుంటున్నామని ఆయన పేర్కొన్నారు. భూకంపం ధాటికి కొన్ని రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. భూకంపం చాలా భయంకరంగా వచ్చిందని, ఇంతకుముందెన్నడూ తాము అలాంటి దానిని చూడలేదని పెనొనోమ్ సిటీకి చెందిన ఓ పౌరుడు చెప్పాడు. కాగా.. సెంట్రల్ హెరెరా ప్రావిన్స్‌లోని పిటాలోజా అర్రిబా పట్టణానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. ముందుగా భూకంప తీవ్రతను 8.0గా అంచనా వేసినా తర్వాత దానిని 7.7 తీవ్రతగా యూఎస్‌జీఎస్ లెక్కించింది. అలాగే, భూకంపంతో తూర్పు పసిఫిక్‌లో సునామీ వస్తుందని హెచ్చరిక కూడా జారీ చేసింది. తర్వాత ఆ హెచ్చరికను ఉపసంహరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు..

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

Updated Date - Oct 10 , 2026 | 11:19 AM