Share News

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:01 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పుణె రూరల్ పోలీసులు పలు విషయాలను గుర్తించారు.

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!
Ketan Agarwal case

మహారాష్ట్ర, జులై 22: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పుణె రూరల్ పోలీసులు పలు విషయాలను గుర్తించారు. నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేతన్‌ను హత్య చేసేందుకు నిందితులు మొదట లోహగఢ్ కోటను కాకుండా వేరే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


కేతన్ హత్యను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై నిందితులిద్దరూ కొన్ని వారాల పాటు రెక్కి నిర్వహించారు. హత్య చేయడానికి ముందు వారు లోనావాలాలోని ప్రసిద్ధ ‘టైగర్ పాయింట్’తో పాటు సమీపంలోని విసాపూర్ కోట, ఇతర ఎత్తైన ప్రాంతాలను పరిశీలించారు. తొలుత టైగర్ పాయింట్ ప్రాంతంలో చంపాలని భావించారు. చివరకు లోహగఢ్ కోటను హత్యకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. మే 31కి ముందే వీరు లోహగఢ్ కోటను ఖరారు చేసుకుని, దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఒకరికొకరు షేర్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.


కేతన్ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా స్కెచ్ వేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంగా చిత్రీకరించే కంటే ముందు.. హత్య చేసేందుకు నిందితులు పథకం వేశారని ఓ పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు. కేతన్‌ను చంపేందుకు ఓ కిరాయి వ్యక్తి కోసం ఇద్దరూ చర్చించుకున్నారని, అయితే ఎవరిని నిందితులు సంప్రదించలేదని పోలీస్ అధికారి వెల్లడించారు. కేతన్‌ను చంపేందుకు విష ప్రయోగంతో సహా ఇతర మార్గాలపై నిందితులు పరిశోధన చేశారని, అలాగే కేసు నుంచి తప్పించుకునేందుకు మార్గాలను కూడా అన్వేషించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


ఇవి కూడా చదవండి:

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కేంద్రం

ప్రధాని నివాసం ముట్టడి

Updated Date - Jul 22 , 2026 | 01:29 PM