Share News

దారుణం.. మహిళ కడుపులో కత్తెర మరిచారు.. ఐదేళ్ల తర్వాత..

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:19 PM

వైద్యులు చేసిన పొరపాటు, ఒక మహిళ జీవితాన్ని ఐదేళ్ల పాటు నరకప్రాయంగా మార్చింది. శస్త్రచికిత్స సమయంలో కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

దారుణం.. మహిళ కడుపులో కత్తెర మరిచారు.. ఐదేళ్ల తర్వాత..
Kerala medical negligence,

ఇంటర్నెట్ డెస్క్: కేరళ(Kerala)లో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ ఐదేళ్లు నరకం అనుభవించింది. ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పున్నప్రా(Punnapra) ప్రాంతానికి చెందిన ఉష జోసెఫ్‌కుట్టి(51)కు ఐదేళ్ల క్రితం అప్పుజ మెడికల్ కాలేజ్(Appuja Medical College) ఆస్పత్రిలో గర్భాశయం తొలగించారు. అప్పటి నుంచి ఆమె తరుచూ కడుపునొప్పి, యూరిన్‌లో రక్తం రావడం లాంటి సమస్యలతో నరకం అనుభవించింది. ఎన్నో ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఓ యూరాలజిస్ట్ సలహా మేరకు సిటీ స్కాన్ చేయించుకుంది ఉష. ఎక్స్-రే రిపోర్టు చూసిన డాక్టర్ షాక్‌కి గురయ్యాడు. గతంలో శస్త్రచికిత్స జరిగిన సమయంలో డాక్టర్లు పొరపాటున ఆమె కడుపులోనే ఒక సర్జికల్ కత్తెరను మర్చిపోయినట్లు నిర్ధారణ అయ్యింది.


జోసెఫ్, మే 2021న మెడికల్ కాలేజ్‌లో గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు కడుపునొప్పితో నరకం అనుభవించింది జోసెఫ్. తన కడుపులో కత్తెర ఉన్న విషయం తెలిసిన తర్వాత మానసికంగా ఆందోళనకు గురైంది. ఎక్స్-రే తీసుకొని అదే మెడికల్ కాలేజ్ వెళ్లింది ఉష జోసెఫ్. వైద్యులు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవొద్దని తమను బెదిరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు తెచ్చిన అదే మెడికల్ కాలేజ్‌లో ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉందని కన్నీరు పెట్టుకుంది ఉష. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘బాధితురాలికి చాలా అన్యాయం జరిగింది. ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో నరకం అనుభవించింది. ఆమె ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను’ అని అన్నారు. ఉషకు మెరుగైన చికిత్స కోసం కొచ్చిలోని ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ ఏడాది చివరి గ్రహణం.. ఎప్పుడంటే? .. ఆ రోజు ఇలా చేయండి..

మిగులు ప్లాట్లను మింగేస్తారా?

For More AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 02:15 PM