Kerala: లవర్‌ని పెళ్లి చేసుకోవడానికి స్కెచ్.. చివరికి ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:26 PM
ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక యువకుడు వేసిన పథకం చివరికి అతనికే రివర్స్ అయ్యింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు ఫూల్ అయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచినట్లు.. తన ప్రియురాలిని(Lover) పెళ్లి చేసుకోవడం కోసం ఓ యువకుడు వేసిన స్కెచ్ బెడిసికొట్టి పోలీసు (Police)లకు చిక్కిపోయిన ఘటన కేరళ(Kerala)లో జరిగింది. పతనంతిట్ట జిల్లా(Pathanamthitta)కు చెందిన రంజిత్ రాజన్(24) ఓ యువతిని ప్రేమించాడు. కానీ, వీరిద్దరి ప్రేమను యువతి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అంతేకాదు యువతికి మరొకరితో పెళ్లి చేయడానికి సిద్దమయ్యారు. ఈ విషయం తెలిసిన రంజిత్ తన లవర్ కుటుంబసభ్యుల ముందు గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ఒక పథకం వేశాడు. ప్రియురాలిని కారుతో ఢీ కొట్టించి.. తానే కాపాడినట్లు బిల్డప్ ఇచ్చి ఆమె కుటుంబసభ్యుల ముందు హీరో అనిపించుకోవాలని స్కెచ్ వేశాడు.
డిసెంబర్ 23న ఆ యువతి కోచింగ్ ముగించుకొని స్కూటర్‌పై వెళ్తుండగా.. రంజిత్ స్నేహితుడు ఏజెస్ (19) ఆమెను కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఆ ప్రమాదంలో యువతి మోచేయి, చేతి వేలు విరిగింది. మరో కారులో వచ్చిన రంజిత్ ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించాడు. తాను చేసిన పనికి ఆ యువతి కుటుంబ సభ్యులు తనను హీరోగా భావిస్తారని అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయ్యింది. రంజిత్ వేసిన ప్లాన్ ఆ యువతికి తెలియకపోవడంతో ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని క్షుణ్ణంగా పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా ఏజెస్‌ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. పోలీసులు రంజిత్, ఏజెస్ ని హత్యాయత్నం నేరం కింద అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి:
అయ్యో.. నా బిడ్డకు ఎంత కష్టం.. తండ్రి వేదన నెట్టింట వైరల్
గుడ్లురిమి చూస్తున్న మహిళ.. ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే.. అసలు కథేంటంటే..