Share News

కేరళంను ముంచెత్తిన వరదలు.. 8 మంది మృతి!

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:40 PM

గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళం అల్లాడిపోతోంది. వర్షాల ధాటికి సంభవించిన తీవ్ర నష్టం, కొండచరియలు విరిగిపడటం, వరద ఉధృతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు.

కేరళంను ముంచెత్తిన వరదలు.. 8 మంది మృతి!
Kerala Heavy Rains

తిరువనంతపురం, ఆగస్టు 02: గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళం అల్లాడిపోతోంది. వర్షాల ధాటికి సంభవించిన తీవ్ర నష్టం, కొండచరియలు విరిగిపడటం, వరద ఉధృతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు. అలానే మరొక ఎనిమిది మంది గల్లంతయ్యారని, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తెలిపారు. ఇవాళ(ఆదివారం) వర్ష తీవ్రత కొంత తగ్గినా, ప్రమాదం ఇంకా పొంచే ఉందని ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఈ ప్రకృతి విపత్తు కారణంగా పలు జిల్లాల్లో వందలాది ఇళ్లు దెబ్బతినగా, వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు (Relief Camps) ఇప్పటికే 5,000 కంటే ఎక్కువ మందిని తరలించారు. ఇడుక్కి జిల్లాలో సంభవించిన ఘోర కొండచరియల ఘటనలోనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది.


పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆరోగ్య రంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అన్ని ఆసుపత్రులలో అత్యవసర ఔషధాల నిల్వలను అందుబాటులో ఉంచామని వెల్లడించింది. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో (Disaster-Prone Areas) వైద్య బృందాలను నిరంతరం అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టమైన విధానం ఉండాలి: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తాం: శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్..

Updated Date - Aug 02 , 2026 | 09:44 PM