Share News

లారీని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురి మృతి..

ABN , Publish Date - Aug 02 , 2026 | 06:39 PM

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం విషాదాన్ని నింపింది.

లారీని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురి మృతి..
Coimbatore Road Accident

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం పొల్లాచ్చి-పళని జాతీయ రహదారిపై నల్లంపల్లి జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని స్థానిక అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని కోయంబత్తూరు జిల్లా మదుక్కరై సమీపంలోని గురుబంపాలయం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులను కనగరాజ్, ఆయన భార్య నర్మద, వారి కుమార్తెలు ఆర్తి, పూరణిగా తెలిపారు. అయితే, ఈ ఘటనలో మరణించిన ఐదో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించారు. కాగా, ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో బంధువులు, స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

కర్ణాటక శివమొగ్గ జిల్లాలో విషాదం.. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి..

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

Updated Date - Aug 02 , 2026 | 06:54 PM