Share News

ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం..

ABN , Publish Date - Aug 02 , 2026 | 06:43 PM

నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ సంస్థ ఆగస్టు 5న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.

ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం..
Abhijeet Dipke

నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ (CJP) సంస్థ ఆగస్టు 5న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో వ్యవస్థాపకుడు అభిజిత్ నివాసంలో కోర్ కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది (CJP meeting).


గత నెల రోజులుగా చేపట్టిన ఉద్యమంపై సమీక్షతో పాటు, ఇకపై అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో తీసుకోనున్నారు. రాష్ట్రాల వారీగా విద్యార్థులు, వాలంటీర్లు, కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలను కూడా కోర్ కమిటీ చర్చించనుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. తదుపరి దశలో చేపట్టే ఉద్యమాలు, కార్యక్రమాలపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది (CJP August 5 meeting).


విద్యార్థి నిరసనల అంశంపై స్పందిస్తూ పిల్లలను క్షమిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు (NEET protest). అయితే క్షమాపణలతో సరిపెట్టకుండా విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిమాండ్ చేశారు. అలాగే జులై 20న జరిగిన పోలీసు చర్యపై ప్రభుత్వం అధికారికంగా క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ఏదేమైనా ఆగస్టు 5 సమావేశం అనంతరం సీజేపీ ఉద్యమం ఏ దిశగా సాగనుందనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది.


ఇవి కూడా చదవండి..

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..


వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 02 , 2026 | 06:43 PM