Share News

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

ABN , Publish Date - Aug 02 , 2026 | 03:03 PM

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం తీవ్ర కార్చిచ్చుతో అల్లకల్లోలంగా మారింది. వాషింగ్టన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇప్పటివరకు 2.5 లక్షల ఎకరాలకు పైగా భూమిని దహనం చేశాయి.

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..
Washington wildfires 2026

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం తీవ్ర కార్చిచ్చుతో అల్లకల్లోలంగా మారింది. వాషింగ్టన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇప్పటివరకు 2.5 లక్షల ఎకరాలకు పైగా భూమిని దహనం చేశాయి. పరిస్థితి విషమించడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు (Washington wildfires 2026).


4,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ గార్డ్ బృందాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. బలమైన గాలులు, తీవ్ర ఉష్ణోగ్రతలు మంటలు వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయి. ఈ మంటలు వేగంగా విస్తరించి స్పోకేన్ నివాస ప్రాంతాలకు చేరుకున్నాయి. దాదాపు 4,000 భవనాలు ప్రమాదంలో ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వందలాది ఇళ్లను ఖాళీ చేయించారు (Washington emergency).


మంటల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సుమారు 60,000 మంది వినియోగదారులు విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆసుపత్రులు, నీటి శుద్ధి కేంద్రాలు వంటి కీలక సేవలను కూడా ఆపేయాల్సి వచ్చింది. సుమారు 2.3 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు (US wildfire news).


మొత్తం 5 కోట్ల మందికి పైగా అమెరికన్లపై ఈ కార్చిచ్చు ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు (Forest fire USA). దీంతో తూర్పు వాషింగ్టన్ సహా పలు ప్రాంతాల్లో జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ ఫ్లాగ్ హెచ్చరికను జారీ చేసింది.


ఇవి కూడా చదవండి:

తైపీ ఓపెన్: చరిత్ర సృష్టించిన తన్వి శర్మ.. 18 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటి

హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో ట్విస్ట్.. సీఎస్కేతో చర్చలే లేవన్న ముంబై ఇండియన్స్

Updated Date - Aug 02 , 2026 | 03:21 PM