Share News

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..

ABN , Publish Date - Aug 02 , 2026 | 03:38 PM

తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆ బాలిక తల్లి ధన్యవాదాలు తెలియజేశారు.

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..
arendra Modi, girl apology

తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆ బాలిక తల్లి ధన్యవాదాలు తెలియజేశారు. 'ఆయన నా కూతురికి జీవనదానం చేశారు. ఆమె జీవితాన్ని కాపాడారు' అంటూ భావోద్వేగంగా స్పందించారు (Modi forgive students).


ఢిల్లీలోని ఇటీవలి నిరసన కార్యక్రమంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో సదరు బాలికపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అనంతరం ఆమె వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ, తాను చేసిన తప్పును అంగీకరించింది. ఇకపై ఇలాంటి పొరపాటు చేయనని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలిక తల్లి మీడియాతో మాట్లాడారు (Narendra Modi girl apology).


'ప్రధాని మోదీ ఎంతో పెద్ద మనసుతో మా కుమార్తెను క్షమించారు. ఆయన చూపిన కరుణను జీవితాంతం మర్చిపోలేం. మా కూతురికి కొత్త జీవితం ఇచ్చినట్లే' అని అన్నారు. తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ను కూడా ఉపసంహరించుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో తన కుమార్తె పేరు, వయస్సు వంటి వివరాలు కూడా సరిగా నమోదు కాలేదని తెలిపారు (Delhi student protest).


కాగా, తనపై, తన తల్లిపై అసభ్య పదజాలం ఉపయోగించిన విద్యార్థులను శిక్షించడం కంటే వారిని సరైన మార్గంలో నడిపించడం ముఖ్యమని ఇటీవల ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారిని కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల ప్రయోజనం లేదని, వారు దారి తప్పిన పిల్లలని భావించి క్షమించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

తైపీ ఓపెన్: చరిత్ర సృష్టించిన తన్వి శర్మ.. 18 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటి

హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో ట్విస్ట్.. సీఎస్కేతో చర్చలే లేవన్న ముంబై ఇండియన్స్

Updated Date - Aug 02 , 2026 | 03:42 PM