Share News

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:29 PM

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు హైకోర్టు శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ సేవలపై గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత

ఇంటర్నెట్ డెస్క్: ఓలా, ఉబర్, ర్యాపిడో‌లకు గుడ్ న్యూస్ చెప్పింది కర్ణాటక హైకోర్టు. ఆ రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది న్యాయస్థానం. నూతన విధానంలో బైక్ ట్యాక్సీలను వాణిజ్య వాహనాలుగా పరిగణించనున్నారు. దీనికి అనుగుణంగా బైక్‌లను ట్యాక్సీలుగా ఉపయోగించేందుకు వాహన యజమానులు ముందుగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


అగ్రిగ్రేటర్లు కూడా కొత్త దరఖాస్తులు సమర్పించుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. గతేడాది జూన్‌లో సింగిల్ బెంచ్ ఆదేశాలతో ఆ రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఓలా, ఉబర్ వంటి అగ్రిగ్రేటర్లు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఇదిలా ఉండగా.. హైకోర్టు తీర్పుపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందిస్తూ.. సమస్యపై చర్చలు జరిపిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


ఇవీ చదవండి:

బ్రెజిల్‌ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్‌ భారత్‌

Updated Date - Jan 23 , 2026 | 04:01 PM