ప్రపంచ రెండో రద్దీ నగరం బెంగళూరు
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:57 AM
ప్రపంచంలో రెండో రద్దీ నగరంగా (ట్రాఫిక్‌లో) దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు నిలిచింది.
టామ్‌టామ్ నివేదికలో వివరాలు
బెంగళూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో రెండో రద్దీ నగరంగా (ట్రాఫిక్‌లో) దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు నిలిచింది. అంతర్జాతీయ లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్‌టామ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. 2025లో బెంగళూరు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనే నగరాలలో రెండో స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. అత్యంత ట్రాఫిక్ కలిగిన నగరాలలో మెక్సికో సిటీ తొలిస్థానంలో ఉండగా ఐర్లండ్‌లోని డబ్లిన్ నగరం మూడోస్థానంలో నిలిచింది.
బెంగళూరులో పది కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 36 నిమిషాలు పట్టినట్టు నివేదిక పేర్కొంది. 2024తో పోల్చితే ఆ సమయం రెండు నిమిషాల నాలుగు సెకన్లు పెరిగిందని తెలిపింది. బెంగళూరులో వారంలో ఏడు రోజుల పాటూ ట్రాఫిక్ కొనసాగుతుందని పేర్కొంది. ఏడాదికి 168 గంటల పాటు కేవలం రష్ అవర్ ట్రాఫిక్‌లో ఉంటారని, రోజుల ప్రకారం లెక్కపెడితే ఒక వ్యక్తి తన జీవితంలో విలువైన 7.40 గంటలను రోడ్డుపైనే వృథాగా గడుపుతారని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
ఆస్ట్రేలియాలో మళ్లీ కాల్పుల కలకలం ముగ్గురు మృతి