కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:21 PM
నిర్మాణంలో ఉన్న వంతెనను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. ఈ ఘటన కర్ణాటక షాహాపూర్ తాలూకాలోని ఇబ్రహీంపూర్ సమీపంలో సూరత్ - చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
బెంగళూరు, నవంబర్ 08: నిర్మాణంలో ఉన్న వంతెనను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. ఈ ఘటన కర్ణాటక షాహాపూర్ తాలూకాలోని ఇబ్రహీంపూర్ సమీపంలో సూరత్ - చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి.. షాహాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల స్వస్థలం యాదగిరి జిల్లా అని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని తుల్జా భవాని దేవిని వారంతా దర్శించుకుని.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. కారు డ్రైవర్ వేగంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పేర్కొన్నారు. మృతులు.. గురురాజ్ సురేశ్ చవాన్ (29), రెడ్డి బగ్లా రాథోడ్ (33), గోవింద సీత్యా చవాన్ (28), కుమార్ రామ్ రాథోడ్ (26)గా గుర్తించామని షాహాపూర్ పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విమానం టికెట్ రేట్లు ఎక్కువని రైలెక్కాడు.. చివరికి అతడికి ఊహించని షాక్..
పరిషత్ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టిన ప్రజలు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
For More AP News And Telugu News