కర్ణాటకలోని భూతనాథ సరస్సులో 6 మృతదేహాల లభ్యం
ABN , Publish Date - Aug 26 , 2026 | 01:22 PM
కర్ణాటకలోని ఓ సరస్సులో ఆరు మృతదేహాలు లభ్యమవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని భూతనాథ సరస్సులో ఈ రోజు ఉదయం ఆరు మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. ఇంకా ఏవైనా మృతదేహాలు ఉన్నాయా అని పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ చారిత్రక పట్టణమైన బాదామిలో గుహాలయాలకు కింది భాగంలో భూతనాథ సరస్సులో స్థానికులు ఈ రోజు(బుధవారం) ఆరు మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సరస్సులో ఇంకా ఏవైనా మృతదేహాలు ఉన్నాయేమోనని గాలింపు చర్యలు చేపట్టారు.
మృతదేహాలు లభ్యమైన సరస్సు ప్రముఖ పర్యటక ప్రాంతం అయినందున దీనిని వీక్షించేందుకు వచ్చి ప్రమాదవశాత్తు సరస్సులో పడి చనిపోయారా?, ఏమైనా ఆత్మహత్యా కోణమా?, ఎగువ నుంచి ఏమైనా కొట్టుకొచ్చాయా?, వీరితోపాటు ఇంకెవరైనా ఉన్నారా?, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News