జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి
ABN , Publish Date - Jun 29 , 2026 | 02:35 PM
జైపుర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ జైపుర్‌లోని చందవాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కాగా.. కూలీలతో సహా 12 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బేస్మెంట్‌లో ఎస్‌టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అధికారులు. శిథిలాల్లో చిక్కుకున్న మరి కొందరు కార్మికుల కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక జిల్లా కలెక్టర్ సందేశ్ నాయక్ సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చదవండి:
కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!
భారత్-పాక్ సరిహద్దుల్లో మరో పాక్ వ్యక్తి అరెస్ట్