పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:34 AM
దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్నిచోట్ల నదులు ఉప్పొంగి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇంకొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ప్రాణాలు తీస్తున్నాయి.
ఇడుక్కి/జల్గావ్/కిష్త్వార్: దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్నిచోట్ల నదులు ఉప్పొంగి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇంకొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గత ఇరవై నాలుగు గంటల్లో మహారాష్ట్రలో 13 మంది దాకా మరణించారని సమాచారం. కాగా ముంబై, పుణెల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది.
కేరళంలోని ఇడుక్కి జిల్లాలో భీకర వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా కొంతమంది గాయపడ్డారు. మలప్పురంలో నాలుగేళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. అక్కడ కురిసిన అతి భారీ వర్షాల వల్ల వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలవుతున్నారు!
For More National News And Telugu News