Share News

బెంగాల్‌లో ఉగ్రకుట్ర భగ్నం

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:56 AM

రాజకీయ నాయకులకు వలపు వల వేసి రహస్య సమాచారం సేకరించేందుకు జరుగుతున్న ఓ భారీ ఉగ్ర కుట్రను పశ్చిమ బెంగాల్‌ పోలీస్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) భగ్నం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లాలో అర్పిత సర్కార్‌ అనే మహిళను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు.

బెంగాల్‌లో ఉగ్రకుట్ర భగ్నం

కోల్‌కతా: రాజకీయ నాయకులకు వలపు వల వేసి రహస్య సమాచారం సేకరించేందుకు జరుగుతున్న ఓ భారీ ఉగ్ర కుట్రను పశ్చిమ బెంగాల్‌ పోలీస్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) భగ్నం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లాలో అర్పిత సర్కార్‌ అనే మహిళను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇటీవల అరెస్ట్‌ చేసిన హమీమ్‌ మోండల్‌ అనే వ్యక్తిని విచారణ చేయగా అర్పిత పేరు వెలుగులోకి వచ్చింది. హమీమ్‌ రాష్ట్రంలో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అర్పిత సర్కార్‌ సాయంతో అతడు ఈ భారీ కుట్రను నడిపిస్తున్నట్లు ఎస్‌టీఎఫ్‌ అధికారులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలవుతున్నారు!

ఈ దఫా డీలిమిటేషన్‌ లేనట్టే?

For More National News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 08:01 AM