పాత బట్టల కింద 2,500 లిక్కర్ బాటిళ్లు.. గుజరాత్‌లో మద్యం రాకెట్ బట్టబయలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 07:01 AM
సెకండ్ హ్యాండ్ బట్టల వ్యాపారం ముసుగులో మద్యం బాటిళ్లు అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠా గుజరాత్ పోలీసులకు పట్టుబడింది.
ఇంటర్నెట్ డెస్క్: సెకండ్ హ్యాండ్ బట్టల వ్యాపారం ముసుగులో మద్యం బాటిళ్లు అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠా గుజరాత్ పోలీసులకు పట్టుబడింది. అహ్మదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించగా.. స్మగ్లర్ల గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు పాత బట్టలను వ్యాపారం పేరుతో గుజరాత్‌కు తరలిస్తున్నారు. అయితే వీటి కింద భారీగా మద్యం బాటిళ్లు దాచి.. అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ బాటిళ్లను అహ్మదాబాద్ తీసుకువెళ్లి ఓ అపార్ట్‌మెంట్‌లో అన్‌లోడ్ చేస్తున్నారు. ఆ తరువాత స్థానిక డీలర్లకు వాటిని విక్రయిస్తున్నారు.
దీనిపై పోలీసులకు పక్కాగా సమాచారం అందడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలించిన 2,736 బాటిళ్లను సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు 6 లక్షలు ఉంటుంది. అలాగే ఈ రవాణా కోసం ఉపయోగించిన వస్తువులు, నిందితుల ఫోన్లు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలూ చదవండి
19 వరకు మద్యం షాపులకు దరఖాస్తులు
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్