Share News

ఢిల్లీ-చెన్నై విమానంలో మంటలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:02 AM

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులతో కలిసి..

ఢిల్లీ-చెన్నై విమానంలో మంటలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

  • మొబైల్‌ పవర్‌ బ్యాంక్‌ వల్లే ప్రమాదం

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులతో కలిసి వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో విమానంలో సీట్లపై లగేజీ సెల్ఫ్‌లో ఉన్న ప్రయాణికుడి బ్యాగులోని మొబైల్‌ పవర్‌ బ్యాంకు నుంచి ఒక్కసారిగా మంటలు అంటుకొని చెలరేగాయి. కాగా, శంషాబాద్‌లో విమానం ల్యాండ్‌ అయ్యాక అక్కడి నుంచి ప్రయాణికులను మరో విమానంలో చెన్నైకి తరలించారు.

Updated Date - Oct 12 , 2026 | 05:04 AM