Share News

బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామంటే కేసే!

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:00 AM

కర్ణాటకలో హాస్పిటల్‌ బిల్‌ పాలసీ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి యూటీ ఖాదర్‌ తెలిపారు. బెంగళూరులో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..

బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామంటే కేసే!

  • కర్ణాటకలో ఆస్పత్రి బిల్‌ పాలసీకి కసరత్తు

బెంగళూరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో హాస్పిటల్‌ బిల్‌ పాలసీ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి యూటీ ఖాదర్‌ తెలిపారు. బెంగళూరులో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ‘డెడ్‌బాడీల బిల్లు వసూళ్లు’ రద్దు కానున్నాయని తెలిపారు. బిల్లు చెల్లించే వరకు మృతదేహాన్ని అప్పగించేది లేదని ఏ ఆసుపత్రి అయినా అంటే కేసు నమోదు చేస్తారని, ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. బిల్లు బకాయి ఉందని పలుచోట్ల ప్రైవేటు ఆసుపత్రులు మృతదేహాన్ని ఇవ్వకుండా వేధించిన సందర్భాలు తమ దృష్టికి వచ్చాయని, వీటి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కట్టుబడి స్పష్టం చేశారు. ఇలాంటి వేధింపులతో మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

Updated Date - Oct 12 , 2026 | 05:01 AM