Share News

ఢిల్లీ ఎన్‌సీఆర్‌‌లో గాలి నాణ్యత పెంపునకు చర్యలు

ABN , Publish Date - Oct 21 , 2026 | 04:57 PM

ఢిల్లీలో గాలి నాణ్యత బుధవారం ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) స్టేజ్‌ 1ను అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి సిర్సా ప్రకటించారు.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌‌లో గాలి నాణ్యత పెంపునకు చర్యలు

ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీలో గాలి నాణ్యత బుధవారం ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) స్టేజ్‌ 1ను అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి సిర్సా ప్రకటించారు. వాయు కాలుష్యం మరింత పెరగకుండా చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్.. సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఈనెల 20న 179గా (మోస్తరు స్థాయిలో) నమోదైంది. అయితే ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటలకు ఏక్యూఐ ఒక్కసారిగా 244కు పెరిగింది. దీంతో గాలి నాణ్యత ‘పూర్’ కేటగిరిలోకి వెళ్లింది. రాబోయే రోజుల్లోనూ గాలి నాణ్యత ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీ (ఐఐటీఎం) అంచనా వేశాయి. దీంతో అధికారులు జీఆర్ఏఫీ మొదటి దశను అమలు చేయాలని నిర్ణయించారు.


కాలుష్య నియంత్రణ చర్యల పెంపునకు ఆదేశాలు

జీఆర్ఏపీ స్టేజ్‌-1లో భాగంగా ఇప్పటికే సూచించిన కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆదేశించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించింది. గాలి నాణ్యత మరింత దిగజారకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. జీఆర్ఏపీ స్టేజ్‌-1లో ప్రజలకు సూచించిన నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించేలా చూడాలని ఆదేశించింది.


గాలి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యతను వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏక్యూఐలో మార్పులు, వాతావరణ శాఖ అంచనాలను పరిశీలించి తదుపరి చర్యలపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఈనెల 21న సవరించిన జీఆర్ఏపీ మార్గదర్శకాలను కూడా కమిషన్ విడుదల చేసింది. వీటిని అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు అమలు చేయాల్సి ఉంటుంది.


ఈ వార్తలనూ చదవండి:

ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?

టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?

Updated Date - Oct 21 , 2026 | 05:23 PM