Share News

ఢిల్లీ హైకోర్టులో సీజేపీ నేతలకు చుక్కెదురు.. పిటిషన్ వెనక్కి..

ABN , Publish Date - Oct 21 , 2026 | 04:07 PM

సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తమ జ్యుడీషియల్ కస్టడీని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

ఢిల్లీ హైకోర్టులో సీజేపీ నేతలకు చుక్కెదురు.. పిటిషన్ వెనక్కి..
Delhi High Court News

ఢిల్లీ, అక్టోబర్10: సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తమ జ్యుడీషియల్ కస్టడీని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక అంశాలను ప్రస్తావించగా.. వారు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.


ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్.. చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉండగా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. పూచీకత్తుల తిరస్కరణకు సంబంధించి బీఎన్‌ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 414 కింద అప్పీల్ చేసుకునే అవకాశం ఉండగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


అలాగే, గతంలో ఇచ్చిన బాండ్లను ఈ ఇద్దరు నేతలు ఉల్లంఘించారనే అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించబోమని గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించి, రెండోసారి నిరోధక చర్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కఠినంగా వ్యవహరించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కోర్టు లేవనెత్తిన ఈ సాంకేతిక, చట్టపరమైన అభ్యంతరాలు , ప్రశ్నల నేపథ్యంలో.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా తమ తరఫున దాఖలు చేసిన పిటిషన్‌ను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..

భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి..

Updated Date - Oct 21 , 2026 | 04:18 PM