అజిత్ డోభాల్ వ్యూహంతో పాక్‌లో అస్థిరత.. భారత్‌పై పాక్ అణు సలహాదారు ఆరోపణలు..
ABN , Publish Date - Oct 21 , 2026 | 01:58 PM
భారత్‌పై పాకిస్థాన్ సీనియర్ అణు వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మజర్ జమీల్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై పాకిస్థాన్ సీనియర్ అణు వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మజర్ జమీల్ (Mazhar Jamil) తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌లో అస్థిరత సృష్టించేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వ్యూహం రచించారని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ అణు విధానంపైనా ప్రశ్నలు లేవనెత్తారు (Ajit Doval Doctrine).
లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) నిర్వహించిన కార్యక్రమంలో అక్టోబర్ 13న మజర్ జమీల్ ప్రసంగించారు. దక్షిణాసియాలో అణు నిరోధక సామర్థ్యం, వ్యూహాత్మక స్థిరత్వంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ), బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సంస్థలకు భారత్ మద్దతు ఇస్తోందని అన్నారు (Pakistan Nuclear Adviser).
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ అణ్వాయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని మజర్ జమీల్ ఆరోపించారు. సాంప్రదాయ ఆయుధాలతోపాటు అణు వార్హెడ్లను కూడా మోసుకెళ్లగల క్షిపణుల వినియోగం ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని వాదించారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని జాతీయ మీడియా పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణి సాంప్రదాయ వార్హెడ్లనే మోసుకెళ్లగలదని, అది భారత అణ్వాయుధ దళాల కమాండ్ పరిధిలో లేదని స్పష్టం చేసింది (India Pakistan Relations).
ఆపరేషన్ సిందూర్ సమయంలో దక్షిణాసియా అణు విపత్తుకు చేరువైందని జమీల్ పేర్కొన్నారు (South Asia Security). పాకిస్థాన్ సంయమనం పాటించడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన వాదించారు. భారత్ అణు సామర్థ్యం, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, సముద్ర ఆధారిత అణు నిరోధక గస్తీ చర్యలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య అపార్థాలు, తప్పుడు అంచనాలకు దారితీయవచ్చని అన్నారు. అణు విధానంపై భారత్ ప్రకటించిన 'నో ఫస్ట్ యూజ్' విధానం కేవలం దౌత్యపరమైన వ్యూహమని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..