Share News

ఇండియా కూటమి భేటీకి నై.. డీఎంకే సంచలన నిర్ణయం

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:34 PM

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది.

ఇండియా కూటమి భేటీకి నై.. డీఎంకే సంచలన నిర్ణయం
DMK Chief MK Stalin

న్యూఢిల్లీ, జూన్04: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 8వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఇండియా కటమి సమావేశాన్ని బహిష్కరించాలని డీఎంకే నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఈ భేటీకి వెళ్లే ప్రసక్తే లేదంటూ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందంటూ డీఎంకే సంచలన ఆరోపణలు చేసింది.

కాంగ్రెస్ పార్టీ వైఖరితో డీఎంకే శ్రేణులు తీవ్ర మనస్తాపం చెందాయని వివరించింది. అందులో భాగంగా కేడర్ భావాలను గౌరవిస్తూనే ఇండియా కూటమి భేటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది.


జూన్ 8వ తేదీన ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ వేదికగా ఇండియా కూటమి అత్యవసర సమావేశం జరగనుంది. ఈ కూటమి సమావేశానికి హాజరు కావాలని ఆ పార్టీ భాగస్వామ్య కూటమిల నుంచి డీఎంకేకు ఆహ్వానం అందింది. అయినప్పటికీ.. హాజరు కాకూడదని డీఎంకే అధిష్ఠానం నిర్ణయించింది.


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరుపై డీఎంకే శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వచ్చింది. తమ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని క్షమించేది లేదంటూ డీఎంకే ఒక ప్రకటన విడుదల చేసిన విషయం విదితమే. ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా డీఎంకే గుర్తు చేసింది. నీట్, ఒకే దేశం-ఒకే సారి ఎన్నికలు, వక్ఫ్ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తమ పోరాటం కొనసాగుతుందని డీఎంకే వెల్లడించింది.


ఈ కూటమితో భేటీకి దూరంగా ఉన్నప్పటికీ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఇతర పార్టీల పోరాటాలకు మద్దతు ఇస్తామని డీఎంకే ప్రకటించింది. దీంతో డీఎంకే - కాంగ్రెస్ బంధంలో వివాదం ముదిరినట్లు అయింది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి డీఎంకే భారీ షాక్ ఇచ్చినట్లు అయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

ప్రతి ఒక్కరూ రేపు సైకిల్‌ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

Read Latest National News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 06:53 PM