రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:41 PM
మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భూముల ధరలు శుక్రవారం నుంచి పెరుగుతాయని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భూముల ధరలు ఏరియాను బట్టి 50 నుంచి100 శాతం పెరుగుతాయని తెలిపారు.
హైదరాబాద్, జూన్04: మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భూముల ధరలు శుక్రవారం నుంచి పెరుగుతాయని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భూముల ధరలు ఏరియాను బట్టి 50 నుంచి100 శాతం పెరుగుతాయని తెలిపారు. ప్రైమ్ ఏరియాలో 100 శాతం పెరుగుతాయన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. భూముల వ్యాల్యూ పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1200 నుంచి రూ.1400 కోట్ల మేర ఆదాయం వస్తుందని చెప్పారు. హయ్యర్ సైడ్ ఏరియాలు శేరిలింగంపల్లి, రాజేందర్ నగర్, ఖాజాగూడ తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగవన్నారు. ఆయా ప్రాంతాల్లో ఛార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపారు.
ఇక నుంచి సబ్ రిజిస్టర్లకు ఫుల్ పవర్స్ కట్ చేశామని.. వారికి మినిమమ్ పవర్స్ మాత్రమే ఉంటాయని మంత్రి పొంగులేటి వివరించారు. భూ సేకరణ సమయంలో ప్రభుత్వానికి కొంత నష్టం జరిగిందన్నారు. కానీ రైతులకు మాత్రం లాభం జరుగుతుందన్నారు. ఇన్నర్ సైడ్ ఎకరం కనీసం రూ.15 లక్షలు ఉందని చెప్పారు. లోయర్ సైడ్ ఏమైనా పొరపాటు జరిగితే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. హయ్యర్ సైడ్ మాత్రం మార్పులు ఉండవన్నారు. సమస్యలు ఉంటే.. హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేస్తామని పబ్లిక్‌కు ఆయన సూచించారు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని చెప్పారు.
ఫ్యూచర్ సిటీని రద్దు చేసి అవకాశమే లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ విషయంలో.. తెలంగాణను మిగతా రాష్ట్రాలు మోడల్‌గా తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఏడాదిన్నరలో 90 శాతం గ్రామాల సర్వే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెవెన్యూలో అవినీతి లేకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్‌లు అధికంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
తాను వచ్చాక ఏసీబీ ట్రాప్ ఆయిన ఫైల్స్ అన్ని క్లియర్ చేశానని తెలిపారు. గత ప్రభుత్వంలో మూడేళ్లు రెవెన్యూ ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. కానీ తాను వచ్చిన మూడు నెలల్లోనే 3,500 రెవెన్యూ ఫైల్స్ క్లియర్ చేశానని వివరించారు. అసెంబ్లీలో పెండింగ్‌లో ఉన్న 10 ఏళ్ల ఫైల్స్ ఆరు నెలల్లోనే క్లియర్ చేసినట్లు చెప్పారు. తనకు ఏ శాఖ కేటాయించినా.. కళ్లు మూసుకొని పని చేస్తానని పేర్కొన్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మంచి జరిగే ఏ పని చేయడానికైనా తాను భయపడనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు రూ. 7 వేల కోట్లు చెలించామని చెప్పారు. రాష్ట్రంలో పాడి ప్రోక్యూర్‌మెంట్ 90 శాతం పూర్తయిందన్నారు. అసైన్డ్ భూములకు పాలసీ తీసుక వస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగినవని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్)లో చేర్చిందని మంత్రి పొంగులేటి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తాం: కె.కేశవరావు
Read Latest TG News And Telugu News