Share News

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి

ABN , Publish Date - May 14 , 2026 | 01:16 PM

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం జరిగింది. దేవాస్‌ జిల్లాలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి
Dewas In Madhya Pradesh

భోపాల్, మే 14: మధ్యప్రదేశ్‌ దేవాస్‌ జిల్లా‌లో ఘోర విషాదం జరిగింది. జిల్లాలో టోంక్ కాలాన్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందగానే జిల్లా ఉన్నతాధికారులతోపాటు పోలీసులు బాణాంసంచా తయారీ కర్మాగారం వద్దకు చేరుకున్నారు.


స్థానికుల సహాయంలో క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీ శబ్ధంతో ఈ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు దాటికి పరిసర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కేరళం సీఎంగా వి.డి.సతీశన్

కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు

For More National News And Telugu News

Updated Date - May 14 , 2026 | 01:41 PM