కేరళం సీఎంగా వి.డి.సతీశన్
ABN , Publish Date - May 14 , 2026 | 12:13 PM
కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం న్యూఢిల్లీలో కేరళం సీఎంగా సతీశన్ పేరును ఏఐసీసీ ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 14: కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం న్యూఢిల్లీలో కేరళం సీఎంగా సతీశన్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. కేరళం ముఖ్యమంత్రి పదవి రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కేరళంలోని పార్టీ కేడర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వి.డి.సతీశన్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
చివరగా సతీశన్ ఎంపిక..
ఏప్రిల్‌లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ జాబితాలో కేరళం అసెంబ్లీ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో కేరళం ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్)కు 102 స్థానాలు కట్టబెట్టాడు. దీంతో పదేళ్ల ఎల్‌డీఎఫ్ పాలనకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తీవ్ర పోటీ నెలకొంది. దాంతో పార్టీ అధిష్ఠానం కేరళలోని కాంగ్రెస్ నేతలతో వరుసగా సంప్రదింపులు జరిపి చివరకు వి.డి.సతీశన్‌ను ఎంపిక చేసింది.
ఫలితాలు వెలువడిన 10 రోజులకు..
ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళంలోని కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సతీశన్ వైపు మొగ్గు చూపింది. దీంతో మే 4వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు పది రోజులకు కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక జరిగింది.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా..
వి.డి. సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964, మే 31వ తేదీన ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరు. పరాపూర్ నుంచి వరుసగా ఆరు సార్లు.. 2001, 2006, 2011, 2016, 2021, 2026లో ఎమ్మెల్యేగా సతీశన్ ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. 2026 ఎన్నికలకు ముందు కేరళ ప్రతిపక్ష నేతగా సతీశన్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురు ప్రయాణికులు సజీవ దహనం
కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు
For More National News And Telugu News