Share News

లిక్కర్ పాలసీ కేసు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:07 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థపై సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది.

లిక్కర్ పాలసీ కేసు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే
Delhi Liquor Policy Case

న్యూఢిల్లీ, మార్చి 9: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో(Delhi Liquor Policy Case) సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థపై సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. సీబీఐ పిటిషన్‌పై ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసు విచారణను కూడా వాయిదా వేయాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.


ఈ కేసుకు సంబంధించి సీబీఐ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇదని అన్నారు. ఎక్సైజ్ పాలసీని మార్చేందుకు లంచాలు ఇచ్చారని ఆరోపించారు. వాట్సాప్ చాట్స్ ద్వారా పాలసీ మార్పుకు ప్రయత్నాలు జరిగాయని.. ఈ కేసులో విజయ్ నాయర్, బుచ్చిబాబు వంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. లిక్కర్ కేసులో రూ.19 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు సాలిసిటర్ జనరల్ వాదనలు చేశారు. రూ.44.5 కోట్లు హవాలా ద్వారా బదిలీ చేశారని తెలిపారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో వినియోగించారని మెహతా కోర్టుకు తెలిపారు.


డిశ్చార్జ్ ఆర్డర్ ఈ దశలో ఇవ్వకూడదని.. సాక్ష్యాలను పూర్తిగా పట్టించుకోలేదని మెహతా ఆరోపించారు. ట్రయల్ దశలోనే సాక్షుల పరీక్ష అవసరమన్నారు. సమావేశాల్లో పాల్గొన్నవారు కోర్టుకు వస్తారన్నారు. ఈ కేసులో దినేశ్ అరోరా కీలక అప్రూవర్ అని తుషార్ మెహతా తెలిపారు. దినేశ్ అరోరా జరిగినదంతా తెలిపారని అన్నారు. వాట్సాప్ ద్వారా పాలసీ మార్పుపై చర్చలు జరిగాయని.. ఈ కేసులో బుచ్చి బాబు చాట్స్ కీలక ఆధారమని ఢిల్లీ హైకోర్టులో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.


ఇవి కూడా చదవండి..

ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రజలకు భారీ ఊరట!

తిరుపతి జిల్లాలో విషాదం.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి

Read Latest National News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 12:26 PM