Share News

కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ABN , Publish Date - May 05 , 2026 | 04:48 PM

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించేందుకు ముగ్గురు సీనియర్ అమికస్ క్యూరీలను ఢిల్లీ హైకోర్టు నియమించింది.

కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
arvind kejriwal

న్యూఢిల్లీ, మే 05: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించేందుకు ముగ్గురు సీనియర్ అమికస్ క్యూరీలను ఢిల్లీ హైకోర్టు నియమించింది. నిందితులు విచారణకు సహకరించకపోయినా న్యాయ ప్రక్రియ ఆగదని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.


నిందితులు తమ వాదనలు వినిపించడానికి నిరాకరించినప్పుడు.. కోర్టుకు సహాయం చేయడానికి నిష్పాక్షిక న్యాయవాదుల నియామకం చేస్తుందని కోర్టు వివరించింది. అమికస్ క్యూరీల నియామకం తర్వాతే సీబీఐ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరపనుంది. మద్యం పాలసీ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతుంది.


ఈ కేసు విచారణలో జడ్జి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆప్ నేతలు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. దీంతో ఈ కేసు విచారణకు హాజరుకాకూడదని వారిద్దరు నిర్ణయించారు. ఆ క్రమంలో జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ బెంచ్‌ను వీరు బహిష్కరించిన విషయం విదితమే. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది: సీఎం చంద్రబాబు

For More National News And Telugu News

Updated Date - May 05 , 2026 | 05:22 PM