మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల్లో అంతరాయం
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:31 PM
మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం భారత్‌లోని పలు విమానయాన సంస్థలపైనా పడింది. ఢిల్లీ నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశామని స్పెస్‌జెట్ ఎక్స్‌లో తెలిపింది. ఢిల్లీ నుంచి పుణె, లేహ్, ముంబైకి వెళ్లాల్సిన సర్వీసులను క్యాన్సిల్ చేశామని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం భారత్‌లోని పలు విమానయాన సంస్థలపైనా పడింది. ఢిల్లీ నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశామని స్పెస్‌జెట్ ఎక్స్‌లో తెలిపింది. ఢిల్లీ నుంచి పుణె, లేహ్, ముంబైకి వెళ్లాల్సిన సర్వీసులను క్యాన్సిల్ చేశామని తెలిపింది. అలాగే ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యల కారణంగా కొన్ని ఫ్లైట్ల సర్వీసులపై ప్రభావం పడింది. లేటెస్ట్ అప్‌డేట్ల కోసం ప్రయాణికులు స్పైస్‌జెట్‌ను సంప్రదించవచ్చు’ అని పేర్కొంది.
అలాగే మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఇండిగోపైనా పడింది. తమ ఈమెయిల్ సపోర్ట్ సేవలపై ప్రభావం పడిందని, తమకు ఎలాంటి ఈమెయిల్స్ రావడం లేదని ఇండిగో ఎక్స్‌లో తెలిపింది. అయితే, ఇతర సపోర్ట్ చానెల్స్ అందుబాటులోనే ఉన్నాయని పేర్కొంది. అత్యవసర సాయం కోసం తమ వెట్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా 6ఈ స్కాయ్‌ను సంప్రదించాలని సూచించింది.
మరోవైపు మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని గమనిస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. తమ సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించింది. అలాగే తమ ప్రసార సాధనాల్లోనూ ఎలాంటి అంతరాయం లేదని ఎక్స్‌లో పేర్కొంది. వేగవంతమైన సేవలు అందించేందుకు తమ ఈమెయిల్స్‌ను రీరూట్ చేశామని, దాంతో ఎలాంటి అడ్డంకులు ప్రతి మెసేజ్ తమకు చేరుతుందని ఎయిరిండియా వివరించింది. కాగా.. మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా మైక్రోసాఫ్ట్ ప్లాట్‌ఫాంలు ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!
న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2