బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:59 PM
ఈరోజు (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పింక్ లైన్ మెట్రో ప్రారంభించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పింక్ లైన్ మెట్రో లాంఛనంగా ప్రారంభించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తావరెకెరె మెట్రో స్టేషన్‌లో మోదీ, డీకే శివకుమార్ పచ్చజెండా ఊపడంతో ఈ పింక్ లైన్ ప్రారంభమైంది. ఆ తరువాత తావరెకెరె నుంచి ఐఐఎంబీ వరకు ఇరు నాయకులూ మెట్రోలోనే ప్రయాణించారు.
మరో కీలక మైలురాయి..
బెంగళూరు మెట్రో చరిత్రలో పింక్ లైన్ మరో కీలక మైలురాయిగా మారనుంది. దీని ప్రారంభంతో ఆ మెట్రో నెట్‌వర్క్103.6 కిలోమీటర్లకు చేరింది. తొలి విడతలో భాగంగా 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ పింక్ లైన్ ప్రారంభమైంది. అలాగే ఏడు మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 21.25 కిలోమీటర్ల మేర పింక్ లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ లైన్‌లో మొత్తం 18 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ఎలివేటెడ్ మార్గం నిర్మాణానికి సుమారు రూ.3,470 కోట్ల వ్యయం కానుంది. కాగా రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు.
ఈ వార్తలూ చదవండి
నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..
సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..