Share News

మరికొన్ని గంటల్లో బైపోల్ రిజల్ట్స్

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:07 AM

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో 5 అసెంబ్లీ స్థానాలతో పాటు అస్సాంలోని ఒక లోక్‌సభ స్థానానికి ఇటీవల ముగిసిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆ ఉప ఎన్నికలకు ఈనెల 6న ఓటింగ్ నిర్వహించగా.. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.

మరికొన్ని గంటల్లో బైపోల్ రిజల్ట్స్
by poll results of 5 assembly seats

ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో 5 అసెంబ్లీ స్థానాలతో పాటు అస్సాంలోని ఒక లోక్‌సభ స్థానానికి ఇటీవల ముగిసిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆ ఉప ఎన్నికలకు ఈనెల 6న ఓటింగ్ నిర్వహించగా.. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మధురాంతకం, ధర్మపురం, బెంగాల్‌లోని నందిగ్రాం, రెజినగర్, పుదుచ్చేరిలోని తట్టంచవాడి అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక ఈ ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాల పనితీరుకు రెఫరెండంగా చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు సీఎం విజయ్ నేత‌ృత్వంలోని టీవీకే ప్రభుత్వం, బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఓటర్లలో అంచనాలు నెలకొన్నాయి.


టీవీకేకు జీవన్మరణ పోరాటం

తమిళనాడులోని మధురాంతకం, ధర్మపురం అసెంబ్లీ స్థానాలకు ఈనెల 6న బైపోల్ నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు తర్వాత తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం టీవీకేకు చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లలో విజయం సాధించిన టీవీకేకు మెజారిటీ మార్కు 118 ఇంకా దక్కలేదు. అలాగే బెంగాల్‌లోని నందిగ్రాం, రెజినగర్‌లో జరిగిన బైపోల్‌ ఫలితాలు అధికార బీజేపీకి ఎంతో కీలకం. చివరి నిమిషంలో టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక బీజేపీ తరపున హసిరాణి రథ్ బరిలో దిగారు. ముఖ్యమంత్రి సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన చంద్రనాథ్ రథ్ తల్లే హసరాణి రథ్. చంద్రనాథ్ రథ్ ఈ ఏడాది మే 6న హత్యకు గురైన విషయం తెలిసిందే.


పుదుచ్చేరి, అస్సాంలోనూ కౌంటింగ్

పుదుచ్చేరిలోని తట్టంచవాడి అసెంబ్లీ స్థానంతో పాటు అస్సాంలోని నగావ్ లోక్‌సభ సీటుకు నిర్వహించిన ఉప ఎన్నికకు కౌంటింగ్ జరుగుతోంది. ఆ ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అభ్యర్థులు, పార్టీల పనితీరుకు ప్రజలు నిదర్శనంగా భావిస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్న పార్టీలు కూడా బైపోల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. తమ తమ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

స్టార్‌లింక్ వివాదంపై రాహుల్ గాంధీకి మస్క్ స్పందన.. 'ఇది నిజంగా ఆందోళనకరం'

మహాత్మా.. మోదీ, జ్ఞానేశ్‌లకు సద్బుద్ధి ప్రసాదించు!

Read Latest National and International news

Updated Date - Oct 09 , 2026 | 10:57 AM