Share News

ఉక్రెయిన్‌లో రెండు బస్సులపై రష్యా దాడి.. 33 మంది మృతి..

ABN , Publish Date - Oct 08 , 2026 | 07:02 PM

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామటోర్స్క్ నగరంలో రెండు ప్రయాణికుల బస్సులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో కనీసం 33 మంది మరణించారు.

ఉక్రెయిన్‌లో రెండు బస్సులపై రష్యా దాడి.. 33 మంది మృతి..
Russia Ukraine war

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామటోర్స్క్ నగరంలో రెండు ప్రయాణికుల బస్సులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో కనీసం 33 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. గురువారం జరిగిన ఈ దాడిని ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా ఖండించారు (Russia Ukraine war).


తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో రష్యా నియంత్రణలో లేని కీలక నగరాల్లో క్రామటోర్స్క్ ఒకటి. ఈ నగరంపై రష్యా దాడులు ఇటీవలి కాలంలో పెరిగాయని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు రోడ్డుపై ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 33 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. దాడికి గైడెడ్ బాంబ్ ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది (Russian strikes Ukraine).


డొనెత్స్క్ ప్రాంత గవర్నర్ వాదిమ్ ఫిలాష్కిన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు (Civilian buses attack). ప్రయాణికులతో ఉన్న బస్సుపై దాడి చేయడం ద్వారా సాధారణ పౌరులను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ ఘటనను ఖండించారు. కాగా, ఈ దాడికి ఒక రోజు ముందు కూడా ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు చేసింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని ప్రిలుకీ నగరంలో నివాస భవనంపై జరిగిన క్షిపణి దాడిలో 22 మంది మరణించారు. వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..


సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

Updated Date - Oct 08 , 2026 | 07:05 PM